V6 News

ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి: కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి: కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: ప్రజలందరికీ వాస్తవాలు తెలిసేలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాలని మంచిర్యాల కలెక్టర్, మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో పౌర సంబంధాల అధికారి, మీడియా అక్రిడిటేషన్ కమిటీ కన్వీనర్ మాదంశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కమిటీ సమావేశానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దినపత్రికలు, న్యూస్ చానళ్లు ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అర్హత గల వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేయడంలో కమిటీ ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలన్నారు. అర్హత లేనివారు పాత్రికేయులుగా చలామణి అవుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా చర్యలు తీసుకుంటామన్నారు.