IPL 2024: 7 బంతుల్లో 3 వికెట్లు.. కష్టాల్లో బెంగళూరు

IPL 2024: 7 బంతుల్లో 3 వికెట్లు.. కష్టాల్లో బెంగళూరు

ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ లో బెంగళూరు జట్టు కష్టాల్లో పడింది. పవరే ప్లే ధాటిగా ఆరంభించినా ముస్తాఫిజుర్ రహ్మాన్ రాకతో ఒక్కసారి సీన్ మారిపోయింది. తొలి నాలుగు ఓవర్లలో 37 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా వెళ్లినట్టు కనిపించింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెన్నై బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. అయితే ఐదో ఓవర్లో ముస్తాఫిజుర్ రెహమాన్ మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి బెంగళూరు జట్టుకు ఊహించని షాక్ ఇచ్చాడు.

 ఈ ఓవర్ మూడో బంతికి భారీ షాట్ కు ప్రయత్నించి డుప్లెసిస్(35) ఔటయ్యాడు. ఇక చివరి బంతికి రజత్ పటిదార్ ను డకౌట్ చేసి చెన్నైకు డబుల్ బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్ మూడో బంతికి మ్యాక్స్ వెల్ డకౌట్ కావడంతో ఆర్సీబీ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. ఈ దశలో  ఆర్సీబీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను కోహ్లీ(11), గ్రీన్(14) తీసుకున్నారు. ప్రస్తుతం బెంగళూరు జట్టు 9 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది.