Aavesham OTT: ఫహద్ యాక్షన్ కామెడీ ఆవేశం..OTT పార్ట్‌నర్ ఖరారు!

Aavesham OTT: ఫహద్ యాక్షన్ కామెడీ ఆవేశం..OTT పార్ట్‌నర్ ఖరారు!

మలయాళం అండ్ తెలుగు,తమిళ చిత్రాలతో వరుస సినిమాలు చేస్తున్న జాతీయ ఉత్త‌మ న‌టుడు అబ్దుల్ హమీద్ మహమ్మద్ ఫహద్ ఫాజిల్..సింపుల్ గా ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil)గా ఎంతో గుర్తింపు పొందారు.పుష్ప సినిమాతో నేషనల్ వైడ్గా మరింత ఫేమస్ అయ్యాడు.విభిన్నమైన పాత్రలు పోషిస్తూ..తనదైన నటనతో ప్రేక్షకుల మనస్సులో ఫహద్ ఫాజిల్ సినిమాలతో..ఒక సిగ్నేచర్ మూమెంట్ని క్రియేట్ చేశాడు.

‘రోమాంచం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఆవేశం(Aavesham) మూవీ నేడు (ఏప్రిల్ 11న) థియేటర్లలలో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలో లోకల్ గ్యాంగ్‍స్టర్ రంగా పాత్రలో ఫాహద్ ఫాజిల్ తన మెస్మరైజింగ్ యాక్టింగ్తో..ఆయనలోని నట విశ్వరూపాన్ని చూపించినట్లు టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా మలయాళంలో వచ్చిన ఇంట్రెస్ట్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అంటూ ఆడియన్స్ థియేటర్స్ లో విజిల్ వేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం..ఆవేశం మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత..అంటే 40 రోజులలో ఓటీటీకి వచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. 

సుకుమార్ - బ‌న్ని కాంబినేష‌న్ లోని వచ్చిన పుష్ప‌లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఫహద్..నెక్స్ట్ రాబోయే సీక్వెల్ పుష్ప 2లో కూడా క‌నిపించ‌నున్నాడు. ఇవే కాదు..ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ ఏకంగా డజను సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ సినిమాల లిస్ట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. 

ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో ఫహద్ ఫాజిల్ హీరోగా ఆర్కా మీడియా రెండు కొత్త సినిమాలను కూడా అనౌన్స్ చేసింది. ఈ సినిమాలకు సంబంధించిన టైటిల్స్‌తో పాటు, ఫస్ట్ లుక్ పోస్టర్‌లను కూడా షేర్ చేసింది. 

సిద్ధార్థ్‌ నాదెళ్ల డెబ్యూ డైరెక్టర్ గా ‘ఆక్సిజన్‌’ (OXYGEN) పేరుతో ఓ సినిమాని ఆర్కా మీడియా ప్రకటించింది. ఇది ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే ఆసక్తికర కథాంశంతో రాబోతోంది. వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఆక్సిజన్‌ తెరెకెక్కిస్తుండగా..శోభ యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, కార్తికేయలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శశాంక్‌ యేలేటి డైరెక్షన్లో తెరకెక్కున్న మరో చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ (Dont Trouble The Trouble). ఫన్‌, థ్రిల్‌, ఎమోషన్స్‌తో వస్తోన్న ఫాంట‌సీ చిత్రం. ఈ సినిమాకి  ప్రవీణ్ ఆంథోని ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మూవీ జూన్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి 2025 లో రిలీజ్ కానుంది.