Premalu OTT Official: అలా డైరెక్ట్గా అడిగితే ఏం చెప్తం..రేపు వచ్చేస్తుంది మీరే చూడండి

Premalu OTT Official: అలా డైరెక్ట్గా అడిగితే ఏం చెప్తం..రేపు వచ్చేస్తుంది మీరే చూడండి

రీసెంట్ మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు(Premalu). దర్శకుడు గిరీష్ ఏడీ(Girish AD) తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ లో నస్లీన్(Naslen), మమిత బైజు(Mamitha Baiju) జంటగా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 9న విడుదలై భారీ విజయాన్ని సాధించింది.

కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే మార్చి 8న తెలుగులో వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు సుమారు రూ.17 కోట్లుకు పైగా రాబట్టి..తెలుగులో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మళయాళ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ప్రేమలు.ఈ సినిమా తెలుగు హక్కులను ఆహా దక్కించుకున్న విషయం తెలిసిందే. 

తాజాగా ప్రేమలు ఓటీటీ రిలీజ్పై ఆహా మరోసారి అధికారిక ప్రకటన చేసింది. "మూవీలో హీరో.. హీరోయిన్ కు ఫోన్ చేసి నీకు లూజ్ మోషన్స్ నీళ్లలాగా వస్తున్నాయా అని అడగడం,దానికి ఆమె వచ్చి చూడు..ఏదో ఒకటి తీసుకురా అనే సీన్ ను ఆహా ఓటీటీ షేర్ చేసింది. "మరీ ఇలా డైరెక్ట్ గా అడిగితే ఏం చెప్తాం.ప్రేమలు ఏప్రిల్ 12 ఉదయం 6 గంటల నుంచి" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ వీడియోను పోస్ట్ చేసింది.

ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో.. ప్రేమలు సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.  అయితే, ఇప్పుడు మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుండగా..తెలుగులో మాత్రం ఆహాలోకి రానుంది.