చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది

చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది

బాంబుల వర్షం కురిపిస్తున్నా.. ఉక్రెయిన్ ఎంతకూ లొంగకుండా ప్రతిఘటన కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచ దేశాల నుంచి అందుతున్న సాయంతో ఒకవైపు రష్యాను ఎదిరిస్తూనే.. మరోవైపు చర్చల ప్రక్రియను కొనసాగిస్తోంది. చర్చల్లో పురోగతి ఎంత వరకు వచ్చిందన్నది ఇరు దేశాలు చెప్పడం లేదు.  రష్యాతో ఉక్రెయిన్ చర్చలు విఫలమైతే .. పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా ప్రకటించారు. యుద్ధాన్ని నివారించడానికి తాము చర్చల ప్రక్రియను కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. ఉక్రెయిన్ లోని పోర్టులు, ఎయిర్ పోర్టులే కాకుండా నివాస ప్రాంతాలు, హాస్పిటల్స్, స్కూళ్లపైనా దాడులు కొనసాగుతున్నాయని, నిన్న మరియుపోల్ సిటీలోని ఆర్ట్ స్కూల్ పై బాంబు దాడి లాంటివన్నీ యుద్ధనేరాలని జెలెన్ స్కీ ఆరోపించారు. రాబోయే కొన్ని శతాబ్దాల పాటు పీడకలలా అందర్నీ వెంటాడతాయన్నారు జెలెన్ స్కీ. రష్యాతో చర్చలు విఫలమైతే అది మూడో ప్రపంచ యుద్ధానికే దారి తీస్తుందని హెచ్చరించారు.
శుక్రవారం పోలాండ్ వెళ్లనున్న జో బైడెన్
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం పోలాండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్ పై రష్యా అక్రమ దాడులు, ఉక్రెయిన్ లో మానవ హక్కుల సంక్షోభంపై అమెరికా మిత్రదేశాలతో చర్చించనున్నట్లు తెలిపింది వైట్ హౌస్. ఉక్రెయిన్ కు 70 వేల టన్నుల బొగ్గును ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది ఆస్ట్రేలియా. మోల్దోవాకు 30 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించనుంది అమెరికా.
హైపర్ సోనిక్, క్రూయిజ్ మిసైల్స్ తో రష్యా సేనల విధ్వంసం
ఉక్రెయిన్ పై యుద్ధంలో తొలిసారిగా హైపర్ సోనిక్, క్రూయిజ్ మిసైల్స్ తో రష్యా సేనలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మొన్న శనివారం ఆయుధాల గ్యారేజ్ పై కింజాల్ హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా... తాజాగా అందిన వార్తల ప్రకారం హైపర్ సోనిక్, క్రూయిజ్ మిసైల్స్ ను ఉపయోగిస్తోంది.  మైకొలైవ్  పోర్టుకు దగ్గరలో ఉన్న ఫ్యూయల్ డిపోపై కింజాల్  క్షిపణితో దాడి చేశామన్నారు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ. కాస్పియన్  సముద్రంలో మోహరించి ఉన్న యుద్ధనౌకల ద్వారా క్రూయిజ్  మిసైల్స్ ని ప్రయోగించినట్లు తెలిపారు. చెర్నిహైవ్  ప్రాంతంలోని ఆయుధాల మరమ్మతుల కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు కూడా మిసైల్స్ ని వాడినట్లు తెలిపింది ఉక్రెయిన్ ప్రభుత్వం. విదేశీ బలగాలు, ఉక్రెయిన్  ప్రత్యేక దళాలు వోవ్ రుచ్ లోని స్థావరంపైనా విమానాల ద్వారా క్షిపణుల్ని ప్రయోగించినట్లు తెలిపింది. హైపర్ సోనిక్  మిసైల్స్ వాడటాన్ని అమెరికా ఇంకా ధ్రువీకరించలేదు. మైకొలైవ్ లో శనివారం ఉక్రెయిన్  నావికుల బ్యారెక్స్ పై జరిగిన క్షిపణి దాడిలో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు.
మరియుపోల్ సిటీని స్వాధీనం చేసుకుంటున్న రష్యా
మరియుపోల్ పై గత మూడు వారాలుగా బాంబులు వర్షం కురిపిస్తున్నారు పుతిన్ సేనలు. మరియుపోల్ సిటీకి వాటర్, ఫుడ్, ఫ్యుయల్ సప్లై నిలిచిపోయింది. భారీ దాడుల కారణంగా భారీస్థాయి ఇనుము-ఉక్కు కర్మాగారం తీవ్రంగా దెబ్బతింది. ఐరోపాలో ఇలాంటి అతిపెద్ద కర్మాగారాల్లో ఇది ఒకటి. ఇతర సిటీల్లో రష్యా సైనికులు ముందుకు వెళ్లలేకపోయినా.. మరియుపోల్ ను మాత్రం స్వాధీనం చేసుకుంటున్నారు రష్యా సేనలు.

 

ఇవి కూడా చదవండి

స్పిన్ దిగ్గజానికి తుది వీడ్కోలు

 

రాఖీభాయ్ ‘తూఫాన్’ షురూ

పగలు మెక్డొనాల్డ్స్ జాబ్.. రాత్రి రన్నింగ్ ప్రాక్టీస్