ఫెయిల్యూర్స్‌‌ మన చేతిలో ఉండవు

ఫెయిల్యూర్స్‌‌ మన చేతిలో ఉండవు

రొమాంటిక్, లక్ష్య చిత్రాల తర్వాత ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంతో వస్తోంది కేతికా శర్మ. వైష్టవ్‌‌ తేజ్‌‌ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 2న రిలీజవుతున్న సందర్భంగా ఇలా ముచ్చటించింది. 

‘‘నా పాత్ర పేరు ‘రాధ’. ప్రేమ, నిజాయితీ గల అమ్మాయి. ఎమోషనల్‌‌గా ఉంటూనే ప్రాక్టికల్‌‌గానూ ఆలోచిస్తుంది. తన లైఫ్‌‌లో ప్రతి విషయాన్నీ బ్యాలెన్స్‌‌ చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి కూతురు, ఫ్రెండ్, సిస్టర్ కావాలనుకుంటారు. నా పేరెంట్స్ డాక్టర్స్. నన్నూ డాక్టర్‌‌‌‌ని చేయాలనుకున్నారు. కానీ నేను యాక్టర్​నయ్యాను. ఇందులో డాక్టర్‌‌‌‌గా నటించాను కనుక నాతో పాటు వాళ్లూ హ్యాపీ. వైష్ణవ్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. తెరపై టామ్ అండ్ జెర్రీలా కనిపించడమే కాదు, సెట్‌‌లోనూ టీజ్ చేసుకుంటూ సరదాగా ఉండేవాళ్లం. తన వినయం, సింప్లిసిటీ అందరికీ నచ్చుతాయి. నరేష్, ప్రభు, తులసి, నవీన్ చంద్ర ఇలా చాలామంది నటించారు. ఒకేసారి  ఇంతమందితో కలిసి ఎలా నటించాలనేది నేర్చుకున్నా. ఈ సినిమాతో కచ్చితంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌‌కి దగ్గరవుతాననే నమ్మకముంది. సక్సెస్‌‌, ఫెయిల్యూర్స్‌‌ మన చేతిలో ఉండవు కనుక రిజల్ట్‌‌ గురించి పట్టించుకోను.

నా పాత్ర విషయంలో హ్యాపీగా ఉన్నానా లేదా అనేదే చూస్తాను. రొమాంటిక్, లక్ష్య చిత్రాల్లో క్యారెక్టర్స్‌‌ని చాలా ఎంజాయ్ చేశాను. అందుకే  రిగ్రెట్ అవలేదు. కథల ఎంపికలో సెలెక్టివ్‌‌గానే ఉంటాను. సోషల్ మీడియాలో నాపై వచ్చే కామెంట్స్‌‌ని కూడా ఎక్కువ చదవను.  నా వర్క్ గురించి వచ్చే కన్‌‌స్ట్రక్టివ్‌‌ క్రిటిసిజమ్‌‌ని మాత్రమే తీసుకుంటాను. దానిపై వర్క్ చేస్తాను. నా కొత్త సినిమాల గురించి త్వరలోనే నిర్మాతల వైపు నుంచి అనౌన్స్‌‌మెంట్స్ వస్తాయి. ఎప్పటికైనా ఓ బయోపిక్‌‌లో నటించాలనేది కోరిక.’’