దుబ్బాకలో నకిలీ నోట్ల కలకలం.. ఒకే నంబర్‌‌ తో కనిపించిన రూ. 200 నోట్లు

దుబ్బాకలో నకిలీ నోట్ల కలకలం.. ఒకే నంబర్‌‌ తో కనిపించిన రూ. 200 నోట్లు

దుబ్బాక, వెలుగు : సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నకిలీ నోట్ల కలకలం చెలరేగింది. శనివారం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... దుబ్బాక పట్టణంలో శనివారం వారాంతపు సంతతో కూరగాయలు అమ్మే ఓ మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు రూ. 200 నోట్లు ఇచ్చి వెళ్లారు. 

ఆ డబ్బులను ఆదివారం మరో వ్యక్తికి ఇస్తుండగా.. ఆ నోట్లపై ఒకే సీరియల్‌‌ నంబర్‌‌ కనిపించడంతో వాటిని నకిలీ నోట్లుగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కీర్తిరాజ్‌‌ తెలిపారు.