బ్యాంకులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

బ్యాంకులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

ఫేక్ బ్యాంక్ గ్యారంటీ డాక్యుమెంట్స్తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఫేక్ బ్యాంక్ గ్యారంటీ డాక్యుమెంట్స్, ఐదు ఫోన్లు, రెండు చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి కోల్కతా కేంద్రంగా ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు  గుర్తించారు. హశ్రిత ఇన్ఫ్రా కంపెనీకి కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ బయో మైనింగ్ కాంట్రాక్ట్ రాగా.. ఈ గ్యాంగ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ పేరుతో కోటి రూపాయల గ్యారెంటీ డాక్యుమెంట్స్ అందించినట్లు దర్యాప్తులో గుర్తించారు. అందుకుగానూ ఈ గ్యాంగ్ రూ. 47 లక్షల కమీషన్  వచ్చినట్లు గుర్తించారు. 

హర్షిత కంపెనీకి నల్గొండ జిల్లాలో 11 బయో మైనింగ్ కాంట్రాక్టులు మంజూరవ్వగా.. వాటికి రూ. 2.25 కోట్ల బ్యాంక్ గ్యారంటీ పత్రాలు అందించినట్లు దర్యాప్తులో తేలింది. వెరిఫికేషన్లో ఈ బ్యాంక్ గ్యారంటీ డాక్యుమెంట్స్ ఫేక్ అని తేలడంతో గుట్టు రట్టైంది. నిందితులు ఇప్పటి వరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో 60 నకిలీ పత్రాలను అందించినట్లు డీసీపీ చెప్పారు. ఆ నకిలీ డాక్యుమెంట్ల విలువ సుమారు రూ. 35 కోట్లు ఉంటుందని అన్నారు.