
హైదరాబాద్‌లో వెలుగులోకి వస్తున్న నకిలీ సర్టిఫికెట్ల దందా వ్యవహారం కలవరం రేపుతోంది. . మొత్తం ఆరుగునిరి అరెస్టు చేశారు. ఈ ముఠాలకు నకిలీ సర్టిఫికెట్లను ఢిల్లీ కేంద్రంగా ఉన్న ప్రధాన సూత్రధారులు తయారు చేసి ఇస్తున్నారు. ఇలా గుట్టుగా కొన్నేళ్లుగా నకిలీ సర్టిఫికెట్లు, ఫేక్ డాక్యుమెంట్స్, దందా నడుస్తుండడం కొంత ఆందోళన కలిగిస్తున్నది. చాలా మంది ఈ నకిలీ సర్టిఫికెట్లపై ఆధార పడుతుండడం గందరగోళానికి గురి చేస్తున్నది.
నిందితులను అదుపులోకి తీసుకున్న SOT పోలీసులు నకిలీ సెల్ డీడ్ పత్రాలు, బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, రెవెన్యూ బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 571 స్టాంప్ పేపర్లు, 48 ఫేక్ జనన పత్రాలు, 11 ఆదాయ సర్టిఫికెట్లు, కంప్యూటర్లు, నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది భూ కబ్జాదారులకు... వివాదం లో ఉన్న భూమికి నకిలీ పత్రాలు సృష్టియించి మోసాని వడిగడుతున్నారని పోలీసులు తెలిపారు. పాత స్టాంప్ పేపర్లను సేకరించి వాటిపై రాసినదాన్ని కెమికల్స్ తో తుడిచేసి కొత్తగా మళ్లీ ముద్రిస్తున్నారు .
సరూర్ నగర్ లో 9 ఏళ్లుగా సాత్విక్ ఎంటర్ ప్రైజస్ పేరుతో నకిలీ పత్రాల ముద్రణ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పత్రాలను 5 వేలు నుండి 20 వేల వరకు అమ్మకాలు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా లీడర్ భాను ప్రకాష్ (A1), అతని భార్య సాగరిక (A2) తో మరికొందనిరి అదుపులోకి తీసుకున్న పోలీసులు 280 నకిలీ సేల్ డీడ్ పత్రాలు సీజ్ చేశారు.
అసలైన అధికారుల పేర్లతో నకిలీ రబ్బరు ముద్రలు తయారు చేసి, ఫేక్ సంతకాలు చేస్తున్నారు. ఈ కేసులోఆరుగురని అరెస్ట్ చేసిన పోలీసులు మరికొంతమందిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్లో కొంతమందికి గతంలో నేర చరిత్ర ఉందని పోలీసులు గుర్తించారు.