నిజం ఏంటీ : దేశంలో మళ్లీ మినీ లాక్ డౌన్ వస్తుందా..?

నిజం ఏంటీ : దేశంలో మళ్లీ మినీ లాక్ డౌన్ వస్తుందా..?

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.. 10, 20 నుంచి ఇప్పుడు ఏకంగా ఒకే రోజు వందల సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి.. డిసెంబర్ 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య.. 2 వేల 669గా నమోదైంది.. డిసెంబర్ 20వ తేదీ ఒక్క రోజే.. 600 పైగా కేసులు బయటపడ్డాయి. మరో ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. కేరళ రాష్ట్రంలోనే ఒకే రోజు ముగ్గురు కరోనాతో చనిపోయారు. దీనికితోడు కరోనా జే1 వైరస్ అనేది వేగంగా వ్యాప్తించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా దేశవ్యాప్తంగా చలి వాతావరణం ఎక్కువగా ఉంది.. చాలా తీవ్రంగా చలి ఉంది.. దీని వల్ల కూడా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు..

కరోనా వ్యాప్తి విషయంలో ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, గుండె సంబంధం వ్యాధులు.. శ్వాసకోశ సమస్యలతో బాదపడుతున్న వారు.. కచ్చింతంగా మాస్క్ ధరించాలనే నిబంధనల అమల్లోకి వచ్చింది. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు ఆదేశాలు.. అధికారికంగా జారీ చేశారు. ఇదే సమయంలో ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దని.. అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని ఆయా రాష్ట్రాల మంత్రులు ప్రకటిస్తున్నారు. ఇలా ప్రకటనలు జారీ చేస్తూనే.. మరో వైపు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్ మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక వార్డులు పెడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్లను ముందస్తు జాగ్రత్తగా రెడీ చేస్తున్నారు..

ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తుంది. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వంటి సెలబ్రేషన్స్ రెడీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కరోనా కేసులు మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. 

ఈ పరిణామాల క్రమంలో.. దేశంలో మినీ లాక్ డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. కొన్ని ఆంక్షలు విధిస్తూ.. కరోనా వ్యాప్తిని కట్టడి చేస్తారనే మాటలు.. జనం నుంచి వినిపించటం విశేషం. పబ్లిక్ ప్లేసుల్లో జనం సమూహాలను నియంత్రించటం.. సామాజిక దూరం పాటించటం.. అందరూ విధిగా మాస్క్ ధరించటం.. ప్రయాణాల్లో జాగ్రత్తలతోపాటు.. సినిమా ధియేటర్లలో సీటుకు సీటు మధ్య గ్యాప్, రాత్రి సమయాల్లో త్వరగా షాపులు, మాల్స్ మూసివేయటం వంటి ఆంక్షలతో.. మినీ లాక్ డౌన్ వస్తుందనే ప్రచారం జరుగుతుంది. 

దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనా ఆంక్షలు, మినీ లాక్ డౌన్ పై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.. అలాంటి ఆలోచన ప్రస్తుతానికి లేదు. కేవలం జాగ్రత్త విషయంలోనూ సూచనలు, సలహాలు ఇస్తున్నాయి ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులపైనా ఎలాంటి ఆంక్షలు విధించలేదు.. సోషల్ మీడియాలో జరుగుతున్నట్లు దేశంలో మినీ లాక్ డౌన్ అనేది ఎక్కడా లేదు..