నకిలీ డాక్టర్ అరెస్ట్

నకిలీ డాక్టర్ అరెస్ట్

సికింద్రాబాద్​,వెలుగు : ఈజీగా మనీ సంపాదించేందుకు డాక్టర్ గా అవతారమెత్తిన ఓ వ్యక్తిని సెంట్రల్ జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు.  కరీంనగర్​కు చెందిన రాజు గంగారాం అంకలాప్​(53) ఉపాధి  కోసం సిటీకి వచ్చి రామంతాపూర్​లో ఉంటున్నాడు. కొంతకాలం ఓ క్లీనిక్​లో పనిచేయగా..ఆ సమయంలో ఆయుర్వేదం, జనరల్​మెడిసిన్​పై  పరిజ్ఞానం సంపాదించాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అంబర్​పేట్​పటేల్ నగర్​లో  శ్రీసాయి వెంకటేశ్వర క్లీనిక్​ను ప్రారంభించాడు. 

అతనికి ఎలాంటి విద్యార్హతలు లేకపోగా.. డాక్టర్​రాజు, డీఎన్​వైఎస్​, పీజీడీఈఎంఎస్​ (ముంబై),ఫ్యామిలీ ఫిజీషియన్​అని బోర్డుపెట్టాడు. వైద్యం కోసం వచ్చిన వారికి  మందులు రాసి ఇస్తున్నాడు. నకిలీ డాక్టర్ గా అనుమానించి సమాచారం ఇవ్వగా టాస్క్​ఫోర్స్​ పోలీసులు  వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లులేవు. ఉన్నవి  నకిలీగా తేలాయి. దీంతో క్లీనిక్​లోని మెడిసిన్ , వైద్య పరికరాలు, రూ.1200 నగదును స్వాధీనం చేసుకున్నారు. రాజుపై కేసు నమోదుచేసి అంబర్​పేట పోలీసులకు అప్పగించగా.. రిమాండ్​కు తరలించారు.