ఒక్కోఫేక్ సర్టిఫికేట్ కు రూ. 50 నుంచి 60 వేలు..ముఠా అరెస్ట్

ఒక్కోఫేక్ సర్టిఫికేట్ కు రూ. 50 నుంచి 60 వేలు..ముఠా అరెస్ట్

యూఎస్, యూకే అబ్రాడ్ కు వెళ్ళే గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ లేని వారికి ఫేక్ సర్టిఫికెట్ లను అందిస్తున్న ముఠాను ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు చైతన్యపురిలో అరెస్ట్ చేశారు. దేశంలో పలు యూనివర్సిటీల ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుండి ఉస్మానియా యూనివర్సిటీ, జెఎన్టీయూ, ఎన్జీ రంగా, ఆంధ్రా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, గుల్బర్గా యూనివర్సిటీ ఇలా 12 యూనివర్సిటీలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన మిర్యాల ఆనంద్ కుమార్ వెబ్ డిజైనింగ్ నేర్చుకొని చింతలకుంట శక్తి నగర్ లో నివాసం ఉంటూ ఫ్లెక్స్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు. మలక్ పేటకు చెందిన మల్లెపాక హేమంత్ ల సహకారంతో ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్ కు రూ.50 నుండి 60 వేలు తీసుకుంటున్నట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. కేసు ఇంకా విచారణలోఉందని... మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గతంలో ఇలా ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసిన వారిపై పీడీ యాక్ట్ లు కూడా నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.