జీడిమెట్ల, వెలుగు: నకిలీ మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. షాపూర్‌నగర్‌కు చెందిన నందికంటి ఉమాభారతి (23) డిగ్రీ సెకండియర్ వరకు చదువుకుంది. పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైంది. ఉద్యోగం రాకపోయినా ఇంట్లో ఉద్యోగం వచ్చినట్టు చెప్పి పోలీస్ యూనిఫాం కొనుక్కొని డ్యూటీ చేస్తుంది.
నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకుని ఖైరతాబాద్ గణేశ్, కోటి దీపోత్సవం, బల్కంపేట్ ఎల్లమ్మ బోనాలు, సీఎం బందోబస్తులో కూడా పాల్గొంది. విశ్వసనీయ సమాచారంతో నిందితురాలిని శనివారం షాపూర్‌నగర్‌లో ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు.
