పాట్నా: ఢిల్లీ పోలీసులు ఫేక్ మెడిసిన్ ముఠా ఆట కట్టించారు. ఈ ముఠా ఏకంగా ఒక ఫేక్ మెడిసిన్ ఫ్యాక్టరీనే నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అధికారులు పోలీసులతో కలిసి ఈ ఫ్యాక్టరీపై దాడులు చేశారు. భారీగా ఫేక్ మెడిసిన్, ఓపియాయిడ్లు స్వాధీనం చేసుకున్నారు. 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోడైన్ సిరప్, ఎక్సైర్డ్ మెడిసిన్ను గుర్తించారు. పాట్నాకు కూతవేటు దూరంలో నకిలీ మందులు, సైకోట్రోపిక్ పదార్థాలను తయారు చేసి రీ--ప్యాకేజ్ చేస్తున్న ఫ్యాక్టరీని ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు.
🚨💊 MAJOR BREAKTHROUGH | ANTF, CRIME BRANCH – DELHI POLICE 🚨💊
— Crime Branch Delhi Police (@CrimeBranchDP) February 23, 2026
🔴 Third Fake Medicine Factory Busted
🔴 Massive haul of spurious drugs, opioids & machinery seized
🔴 Interstate narcotic network nearing collapse
👮♂️ Relentless action by ANTF exposes illegal unit near Patna… pic.twitter.com/mKjreuyqnG
క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. బీహార్‌లో ఇలాంటి రెండు అక్రమ ఫార్మాస్యూటికల్ యూనిట్లు బయటపడిన కొన్ని రోజుల్లోనే మరో ఫేక్ మెడిసిన్ ఫ్యాక్టరీ గుట్టు రట్టవడం గమనార్హం. 2026, జనవరిలో హైదరాబాద్ సిటీలో కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్, సుదర్శన్ రెడ్డి నగర్‌లోని దుర్గా మెడికల్ అండ్ జనరల్ స్టోర్లలో డీసీఏ అధికారులు చేసిన సోదాల్లో ఇదే ఫేక్ మెడిసిన్ దందా బయటపడింది.
Also Read : అరుణాచల్ మహిళలపై జాత్యహంకార దాడి..
షాపులో ఉన్న మూర్చవ్యాధి నివారణకు వాడే లెవిపిల్ 500 టాబ్లెట్లపై అధికారులకు అనుమానం రావడంతో వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. బ్రాండెడ్ ముసుగులో నకిలీ మందులు అమ్ముతున్న షాపు నిర్వాహకుడు మల్లికార్జున్ నుంచి 4 స్ట్రిప్స్ మందులను సీజ్ చేశారు. సీజ్ చేసిన మందులను అసలైన తయారీ కంపెనీ అయిన సన్ ఫార్మాకు వెరిఫికేషన్ కోసం పంపగా.. అవి పూర్తిగా నకిలీవని రిపోర్ట్ వచ్చింది.
ఒరిజినల్ మందులకు, అక్కడ దొరికిన మందులకు పొంతన లేదని తేలింది. ఒరిజినల్ స్ట్రిప్ వైట్ కలర్ లో ఉండగా, ఆ మెడికల్ షాపులో దొరికిన నకిలీ స్ట్రిప్ పసుపు రంగులో ఉంది. స్ట్రిప్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే.. అది కాపీ చేసిన కోడ్ గా చూపిస్తోందని అధికారులు గుర్తించారు.
స్ట్రిప్ మీద ముద్రించిన అక్షరాల సైజులు, అడ్రస్ లో కామాలు కూడా సరిగా లేవని రిపోర్ట్‌లో తేలింది. అసోంకి చెందిన సన్ ఫార్మా లేబొరేటరీస్ లిమిటెడ్ పేరుతో ఈ నకిలీ మందులను తయారు చేసి మార్కెట్లోకి వదిలినట్లు గుర్తించారు. తదుపరి చర్యల కోసం మేడ్చల్ కోర్టుకు తరలిస్తామని డ్రగ్ ఇన్ స్పెక్టర్ తిరుపతి తెలిపారు.
