నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టు...100 కిలోల నిషేధిత బీటీ-3 పత్తి విత్తనాలు సీజ్

నకిలీ విత్తనాల ముఠా గుట్టురట్టు...100 కిలోల నిషేధిత  బీటీ-3 పత్తి విత్తనాలు సీజ్

మల్కాజిగిరి, వెలుగు: రైతులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నకిలీ విత్తన ముఠా గుట్టును మల్కాజిగిరి ఎస్ఓటీ, శామీర్​పేట పోలీసులు కలిసి రట్టు చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన దాసరి శ్రీనివాసరావు (58).. మదనపల్లికి చెందిన శ్రీనివాస్ రావు వద్ద తక్కువ ధరకు ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 పత్తి విత్తనాలను సేకరించాడు. 

వీటిని హైదరాబాద్ పరిసరాల్లోని రైతులకు అధిక ధరలకు విక్రయించేందుకు ప్లాన్ వేశాడు. పక్కా సమాచారంతో శామీర్​పేట ఓఆర్ఆర్ ఎగ్జిట్-7 వద్ద మాటువేసిన పోలీసులు.. నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న రెండు గోనె సంచుల్లోని 100 కిలోల నిషేధిత విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.