మీర్‌పేట్‌ లో నకిలీ SOT పోలీసుల ముఠా అరెస్ట్...

మీర్‌పేట్‌ లో నకిలీ SOT పోలీసుల ముఠా అరెస్ట్...

హైదరాబాద్ లో నకిలీ SOT పోలీసుల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. తామే SOT పోలీసులమంటూ లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఆరుగురు నిందితులను బుధవారం ( మే 20 ) అరెస్ట్ చేశారు పోలిసులు.బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీని ORR ఎగ్జిట్-03 వద్ద అడ్డగించిన నిందితులు. అక్రమ బియ్యం తరలిస్తున్నారంటూ డ్రైవర్‌ను బెదిరించారు.

కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.6 లక్షలు ఇవ్వాలని నకిలీ పోలీసులు డిమాండ్ చేసారని..చివరకు రూ.1.60 లక్షలు తీసుకున్నారని తెలిపాడు బాధితుడు. ఫోన్ పే ద్వారా రూ.80 వేలును నిందితుల ఖాతాలకు ట్రాన్స్‌ఫర్  చేశానని..మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు నిందితులను నిలదీశాడు.

అసలు SOT పోలీసులు కాదని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు. నిందితుల నుంచి రూ.80 వేల నగదు, 7 మొబైల్ ఫోన్లు, ఒక పోలో కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.