ఆపరేషన్​కగార్​ కొనసాగించండి.. చత్తీస్​గఢ్​ సీఎంను కలిసిన నక్సల్స్ బాధిత కుటుంబాలు

ఆపరేషన్​కగార్​ కొనసాగించండి.. చత్తీస్​గఢ్​ సీఎంను కలిసిన నక్సల్స్ బాధిత కుటుంబాలు

భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్‌ బస్తర్​ దండకారణ్యంలోని నక్సల్స్ బాధిత కుటుంబాలు గురువారం ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్​సాయ్‌ను కలిశాయి. ఆపరేషన్ ​కగార్‌‌ను కొనసాగించాలని, బస్తర్​ను నక్సల్స్ రహిత ప్రాంతంగా మార్చాలని బాధిత కుటంబాల వ్యక్తులు విజ్ఞప్తి చేశారు.

నక్సల్స్ కార్యకలాపాలు తారాస్థాయికి చేరుకున్నాయని, ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పిల్లలను నక్సల్స్ సంస్థల్లోకి తీసుకెళ్తున్నారని, యువకులకు తుపాకులు ఇచ్చి వారి భవిష్యత్​ను అంధకారం చేస్తున్నారని, నిరసన తెలిపిన వారిని దారుణంగా హత్య చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఆపరేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు.