అమరవీరులకు ఇచ్చే గౌరవం ఇదేనా..కేసీఆర్పై కుటుంబ సభ్యుల ఆగ్రహం

అమరవీరులకు ఇచ్చే గౌరవం ఇదేనా..కేసీఆర్పై  కుటుంబ సభ్యుల ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వం అమరుల త్యాగాలను గుర్తించడం లేద‌ంటూ హైదరాబాద్ గన్ పార్క్ లో  తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు..రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న స్మృతి వనంలో అమరవీరులను విస్మరించారని ఆవేద‌న వ్యక్తం చేశారు. 12 వందల మంది అమరుల చరిత్రను, వారి ఫోటోలను స్మృతి వనంలో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

స్మృతి వనాన్ని అమరుల కుటుంబ సభ్యులతో ప్రారంభించాలని కోరారు. గత పదేళ్లుగా సీఎం కేసీఆర్ ను కలవడానికి ప్రగతి భవన్ వెళ్తున్నా.. గేట్ లోపలికి కూడా వెళ్లనీయడం లేదని విమర్శించారు. అమరుల కుటుంబాల కోసం ఇచ్చిన జీవో 80ను రద్దు చేయడం వల్ల పెన్షన్ కూడా అందడం లేదన్నారు. జీవో 80ను పునరుద్ధరించి.. జూన్ 2న స్మృతి వనం ప్రారంభానికి అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.