సేమ్ కవిత లాగే: సొంత పార్టీల నుంచి సస్పెండైన కుటుంబ సభ్యులు వీరే..!

సేమ్ కవిత లాగే: సొంత పార్టీల నుంచి సస్పెండైన కుటుంబ సభ్యులు వీరే..!

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గత కొద్ది రోజులుగా కవిత ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. 

ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు మంగళవారం (సెప్టెంబర్ 2) ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, పార్టీ కీలక నేతలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందన్న కారణంతో కేసీఆర్ తన సొంత కూతురినే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కవిత సస్పె్న్షన్ ఎపిసోడ్‎తో దేశ వ్యాప్తంగా పార్టీల నుంచి సస్పెండ్ అయిన కుటుంబ సభ్యుల గురించి చర్చ మొదలైంది. మరీ వివిధ కారణాలతో సొంత పార్టీ నుంచి వేటుకు గురైన కొందరు ప్రముఖ నేతల గురించి తెలుసుకుందాం. 

1. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజీవ్ గాంధీ సతీమణి మేనకాగాంధీ. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో ఆమెను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. మేనకా గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువైనా బీజేపీలో కొనసాగుతున్నారు. 

2. దివంగత నటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కూడా కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి. పార్టీ లైన్ క్రాస్ చేశారన్న కారణంతో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. 

3. తమిళనాడులో ప్రధాన పార్టీ అయిన ద్రవిడ్ మున్నేట కగజం (డీఎంకే) పార్టీలో కూడా కుటుంబ పోరు నడించింది. దివంగత నేత కరుణానిధి తన కుమారుడు ఎంకే అళగిరి పార్టీ వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడటంతో పార్టీ నుంచి వేటు వేశారు.

4. అన్నాడీఎం పార్టీలో కీలక నేతల్లో శశికళ ఒకరు. ఆమె దివంగత తమిళనాడు సీఎం జయలలితకు సోదరి గుర్తింపు. జయలలిత  హయాంలో ఆమె అన్నాడీఎంకే పార్టీలో నెంబర్ 2గా చెలామణి అయ్యారు. కానీ జయలలిత మరణం తర్వాత పార్టీ చోటు చేసుకున్న పరిణామాలతో శశికళను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. 

5. ఉత్తరప్రదేశ్‎ను ఏండ్ల పాటు పాలించిన సమాజ్ వాదీ పార్టీలో కూడా కుటుంబ పోరు నడించింది. పార్టీ లైన్‎కు వ్యతిరేకంగా మాట్లాడటంతో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

6. అప్నాదళ్ పార్టీ వ్యవస్థాపకులు సోన్ లాల్ పటేల్ పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం చేసిన తన కూతురు అనుప్రియ పటేల్‎పై సస్పెన్షన్ వేటు వేశారు. అనుప్రియా పటేల్ ప్రస్తుతం బీజేపీలో ఉంది. 

7. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించడంతో తన కుమారుడు తేజ్ ప్రతాప్‎ను ఆర్జేడీ పార్టీ నుంచి బహిష్కరించారు బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్. 

8. సెక్స్ కుంభకోణంలో దోషిగా తేలడంతో తన మనువడు, మాజీ ఎంపీ రేవణ్ణను జీడీఎస్ నుంచి బహిష్కరించారు మాజీ ప్రధాని దేవగౌడ.

9. ఐఎన్ఎలీడి పార్టీ వ్యవస్థాపక సభ్యులు, హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా పార్టీ వ్యతిరేక కార్యకాలాపాలకు పాల్పడటంతో తన మనవడు దుష్యంత్ చౌతాలాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 

10. మహారాష్ట్రలో బాలాథ్రాకే స్థాపించిన శివసేన పార్టీ నుంచి రాజ్ థాకరే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. బాలాథ్రాకే తమ్ముడు శ్రీకాంత్ థాక్రే కుమారుడే రాజ్ థాక్రే. పార్టీ లైన్ క్రాస్ చేయడంతో సొంత తమ్ముడి కుమారుడు అని కూడా చూడకుండా రాజ్ థాక్రే పార్టీ నుంచి బయటకు పంపించారు. ఆ తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ సేవా సమితి పేరుతో రాజ్ థ్రాకే కొత్త పార్టీ పెట్టారు. 

11. మహారాష్ట్ర మాజీ సీఎం, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‎కు వెన్నుపోటు తప్పలేదు. శరద్ పవార్ స్థాపించిన ఎన్సీపీని ఆయన అల్లుడు అజిత్ పవార్ రెండుగా చీల్చాడు. అజిత్ పవార్ ప్రస్తుతం బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు.

12. ఏపీలో తన సోదరుడు వైఎస్ జగన్‎తో విభేదించి వైసీపీకి రాజీనామా చేశారు షర్మిల. ఆ తర్వాత వైఎస్ఆర్ టీపీ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించి రాజకీయాలు చేశారు. కొన్నాళ్లకు వైస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.