ఫ్యామిలీ ప్లానింగ్‌‌పై బలవంతం చేయలేం

ఫ్యామిలీ ప్లానింగ్‌‌పై బలవంతం చేయలేం

సుప్రీం కోర్టులో అఫిడవిట్‌‌ వేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ఫ్యామిలీ ప్లానింగ్‌‌ పాటించాలని దేశ ప్రజలను బలవంతం చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది. సంతానంపై రూల్స్‌‌ పెడితే ప్రజలు నిరసన వ్యక్తం చేసే చాన్స్‌‌ ఉందని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌‌ ఫైల్‌‌ చేసింది. దేశంలో జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టేలా, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే రూల్‌‌ తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలని బీజేపీ నేత, లాయర్‌‌‌‌ అశ్విని కుమార్‌‌‌‌ ఉపాధ్యాయ్‌‌ ఢిల్లీ హైకోర్టులో పిల్‌‌ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌‌ను కోర్టు కొట్టేసింది. జనాభా కంట్రోల్‌‌పై పార్లమెంట్‌‌, స్టేట్‌‌ గవర్నమెంట్‌‌ చట్టాలు చేయాలని, కోర్టులు ఆ విధంగా ఆదేశాలివ్వలేవని చెప్పింది. ఢిల్లీ కోర్టు తీర్పుపై అశ్విని కుమార్‌‌‌‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ చేసిన సుప్రీంకోర్టు బెంచ్‌‌ కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.

For More News..

జీతాలియ్యట్లేదని ఐఫోన్ ఫ్యాక్టరీపై దాడి

ట్రంప్‌కు న్యాయపరంగా దారులన్నీ క్లోజ్

అయ్యప్పా.. నీ దర్శనమెట్లా!