యువతి వీడియో షేర్ చేసిన ఫేమస్ ఫైట్ మాస్టర్ అరెస్ట్

యువతి వీడియో షేర్ చేసిన ఫేమస్ ఫైట్ మాస్టర్ అరెస్ట్

ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్(Kanal kannan).. ఈ పేరు సౌత్ సినీ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. స్టార్ హీరో ఉన్నారంటే కనల్ కన్నన్ మాస్టర్ ఉండాల్సిందే. రజినీకాంత్(Rajinikanth), కమల్ హాసన్(Kamal haasan), చిరంజీవి(Chiranjeevi).. ఇలా సౌత్ లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతో వర్క్ చేశారు కనల్ కన్నన్ మాస్టర్. 

అయితే  ఈ ఫేమస్ ఫైట్ మాస్టర్ ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారట. దానికి కారణం ఆయన ఓకే వీడియోను షేర్ చేయడమే. అలా అని అదేదో సినిమా వీడియోనో కాదు, ఇంకేదో కాదు. కేవలం ఒక యువతితో పాస్టర్ డాన్స్ చేస్తున్న వీడియో. అది కూడా మన దేశానికి సంబంధించింది కాదు. వేరే దేశానికి చెందింది. ఆ వీడియోని కనల్ కన్నన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

అది కాస్తా సైబర్ క్రైం దృషికి వెళ్లడంతో.. కనల్ కన్నన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.