తెలంగాణ త్యాగాలు, పోరాటాలకు సాక్ష్యం.. నిప్పుల వాగు పుస్తకం

తెలంగాణ త్యాగాలు, పోరాటాలకు సాక్ష్యం.. నిప్పుల వాగు పుస్తకం

ముషీరాబాద్, వెలుగు: ప్రముఖ కవి అందెశ్రీ సంపాదకత్వంలో రూపొందిన నిప్పుల వాగు పుస్తకాన్ని ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, కోయ వనిత, కుంజ రమణమ్మ, బైరాన్ పల్లి పోరాట వనిత జంగిటి లచ్చవ్వ, వలనయోని జానమ్మ, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, జర్నలిస్ట్ కె.శ్రీనివాస్, అందెశ్రీ హాజరయ్యారు.

అనంతరం మాట్లాడిన వక్తలు పాటకు సామాజిక శక్తి ఉందన్నారు. కానీ  పాటపై కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. వందేండ్ల తెలంగాణ చరిత్ర నిండా త్యాగాలు, పోరాటాల పుట్టలేనని, అందుకు సాక్ష్యంగా నిప్పుల వాగు పుస్తకం నిలుస్తుందన్నారు. ప్రొఫెసర్లు హర గోపాల్, కోదండరాం, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ రాములు కార్యక్రమానికి హాజరయ్యారు.