
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై ఛండీఘర్ ఎయిర్ పోర్ట్‌లో CISF కానిస్టేబుల్ చేయిచేసుకున్నారు. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి, అరెస్ట్ చేశారు. కంగనా రనౌత్ రైతుల నిరసనకు వ్యతిరేకంగా చేసిన ట్విట్ కారణంగానే కుల్విందర్ కౌర్ ఆమె చెంపపై కొట్టారని సింగర్ విశాల్ దద్లానీ ఆమెకు మద్ధతుగా నిలబడ్డారు.
ఫేమస్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ విశాల్ దద్లానీ కల్విందర్ కౌర్ కు ఉద్యోగం ఆఫర్ చేశాడు. తాను హింసను పోత్సహించను కానీ.. ఆ మహిళా కానిస్టేబుల్ కోపాన్ని పూర్తి అర్థం చేస్తున్నాను అని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. CISF ఆమెపై ఏదైనా చర్య తీసుకుంటే.. ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని విశాల్ దద్లానీ ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పోస్ట్ చేశారు.