
హిందువులకు చాలా దేవాలయాలున్నాయి. ప్రతి దేవాలయానికి చరిత్ర.. ప్రాధాన్యత.. ఆధ్యాత్మిక కథలు ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా పురాతన శివాలయాలు చాలా ఉన్నాయి. ప్రతి శివాలయానికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది. ప్రపంచంలో ఎత్తైన శివాలయం తుంగనాథ్ లో ఉంది. ఇది పంచ కేదార్ యాత్రలలో ఒకటిగా ఉంది. ఇప్పుడు దీని విశిష్టత ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. . .
తుంగనాథ్ ఆలయం ఉత్తరాఖండ్‌లోని గర్హాల్ హిమాలయాల్లో ఉన్న ఐదు పవిత్ర ప్రదేశాల్లో ఒకటని పురాణాలు చెబుతున్నాయి. కురుక్షేత్ర యుద్దం తరువాత .. పాండవులు శివుడిని పూజించి క్షమాపణలు కోరాలని నిర్ణయించుకుంటారు. పరమేశ్వరుడికి సర్వాంతర్యామి కదా..! ఆయనే ముందే విషయాలను పసిగట్టగలడు. ఈ సమయంలో పాండవులను ఆట పట్టించేందుకు దాగుడు మూతలు ఆడాడని.. అప్పుడు గర్హాల్ హిమాలయాల్లోని వేర్వేరు ప్రదేశాల్లో ఐదు శివాలయాలు స్థాపించారని రుషి పుంగవులు చెబుతాయి. వాటినే ప్రస్తుతం పంచ కేదార్ దేవాలయాలు అని పిలుస్తున్నారు. కేదార్‌నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్ , కల్పేషర్ ప్రాంతాల్లో శివాలయాలు నిర్మించారు.
Also Read:-ఈ గుడిలో ప్రసాదం నేలపైనే ఎందుకు పెడతారు.. దేవుడి దర్శనం కిటికీలో నుంచే చూడాలి..?
తుంగానాథ్లో నిర్మించిన శివాలయం ప్రపంచంలో ఎత్తైన శివాలయం. ఈ ఆలయం 3 వేల 680 మీటర్లు ఎత్తులో ఉంది. ఈ ఆలయం పాండవుల కాలం నాటిదని 8 వశతాబ్దంలో సాధువు.. ఆది శంకరాచార్యులు తెలిపారు. అప్పుడు ఈ దేవాయలన్ని కత్యూరి పాలకులు అభివృద్ది చేశారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతానికి దగ్గరలోనే చంద్రశిల శిఖరం ఉంది. ఈ శిఖరంపై త్రేతా యుగంలో శ్రీరామ చంద్రుడు ధ్యానం చేశాడని పండితులు చెబుతున్నారు. తుంగనాథ్ నుంచి చంద్రశిల శిఖరానికి వెళ్లాలంటే ఇంకా 1.5 కి.మీ. ముందుకు వెళ్ళాలి. తుంగనా థ్ ఆలయం నుంచి కేదార్‌నాథ్, నందా దేవి, త్రిశూల్ చౌఖంభ శిఖరాలు కనపడతాయి.
ఎలావెళ్లాలి
తుంగనాథ్ ఆలయానికి వెళ్లాలంటే మొదట హరిద్వార్ ... రిషికేశ్ చేరుకోవాలి. అక్కడి నుండి బస్సు లేదా టాక్సీలో చోప్టాకు చేరుకోవాలి. మీరు ఉఖిమత్ నుండి బస్సులో కూడా వెళ్లవచ్చు. . చోప్టా ఉత్తరాఖండ్ లోని చాలా అందమైన హిల్ స్టేషన్ ఉంది. అందుకే దీనిని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు.
చోప్టా నుంచి ఆ లయం దాదాపు 3.5 కిలో మీటర్లు ట్రక్ ల్లో .. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఆలయానికి చేరుకోవాలి. ఈ ప్రాంతం మంచుతో కప్పబడి.. పర్వతాలను చూసుకుంటూ వెళితే చాలా ఆనందంగా ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అనుభవం ఉన్న వారు మాత్రమే సురక్షితంగా తీసుకెళ్లగలుగుతారు. చోప్టా నుండి తుంగనాథ్ ఆలయం చేరుకోవడానికి 2 నుండి 3 గంటలు పడుతుందంటే ఈ మార్గం ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు.