
భారతదేశం ఎన్నో చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణుడి ఆలయాల్లో ఉడుపి ఒకటి. ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవాలంటే కిటికీ రంధ్రాల ద్వారా దర్శించుకోవాలి. అంతేకాదు ఇక్కడ ప్రసాదాన్ని నేలపై వడ్డిస్తారు.. అసలు ఉడుపి శ్రీకృష్ణ దేవాయానికి ఉన్న చరిత్ర ఏమిటి.. ఆ దేవాలయాన్ని ఎవరు నిర్మించారో ఈ స్టోరీలో తెలుసుకుందాం...
ఉడుపి శ్రీకృష్ణ ఆలయానికి ఎంతో విశిష్టత .. ప్రాధాన్యత ఉంది. శ్రీకృష్ణ భక్తులు ఈ ప్రాంతాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. నిత్యం వేలాది మంది స్వామిని దర్శించుకుంటారు. ఉడుపి శ్రీకృష్ణ పరమాత్ముడిని కిటికీకి ఉన్న 9 రంధ్రాల ద్వారా మాత్రమే దర్శించుకోవాలి. నేరుగా శ్రీకృష్ణ విగ్రహాన్ని చూడలేరు. ఈ ఆలయంలో బాల రూపంలో ఉన్న చిన్ని కృష్ణుడు దర్శనమిస్తారు. అంతేకాదు ఈ ఆలయంలో ప్రసాదం నేలపైనే వడ్డిస్తారు.
కిటికీనుంచే ఎందుకంటే..
శ్రీకృష్ణ పరమాత్ముడు తన భక్తులలో ఒకరికి దర్శనమిచ్చి.. కిటికీ తయారు చేయించమని.. అది ఎలా ఉండాలో తెలుపుతూ.. 9 రంధ్రాలు ఉండేలా తయారు ఉడుపి ఆలయంలో తన ఎదురుగా ఏర్పాటు చేయాలని ఆదేశించాడట. ఆ కిటికి రంధ్రాల ద్వారానే భక్తులు తనను దర్శించుకుంటారని చెప్పి అంతర్దానమయ్యాడని స్థానికులు చెబుతుంటారు. స్వామి ఆదేశాల ప్రకారం ఆ భక్తుడు అలానే కిటికీనిచేయించి స్వామి సూచించిన ప్రదేశంలో నెలకొల్పాడు. ఆ తరువాత 13వ శతాబ్దంలో మాధవాచార్యులు ఆలయాన్ని నిర్మించారు.
Also Read:-కేదార్ నాథ్ కంటే ఎత్తులో ఉండే.. ఈ తుంగనాథ్ ఆలయం ఎంత మందికి తెలుసు..
13 వ శతాబ్దంలో ఒకసారి మాధవాచార్యులు సముద్ర తుఫానులో తన ఓడ చిక్కుకుపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడిని ప్రార్థించగా.. చిక్కుకున్న ఓడను రక్షించారని చెబుతారు. ఈ ఓడ ఒడ్డుకు చేరుకున్నప్పుడు.. సముద్రపు మట్టితో కప్పిన శ్రీ కృష్ణుడి విగ్రహం కనిపించింది.అప్పుడు మాధవాచార్యులు ఈ శ్రీ కృష్ణ విగ్రహాన్ని తెచ్చి ఉడిపి ఆలయంలో ప్రతిష్టించాడు.
నేలపై నే ప్రసాదం..
భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత, ప్రసాదాన్ని నేలపైనే తింటారు. కోరికలు నెరవేరిన భక్తులు... వారే నేలపై ప్రసాదం వడ్డించమని అడుగుతారు. అందుకే ఆలయంలో నేలపై ప్రసాదం వడ్డిస్తారు. స్వామి దర్శనానికి గంటల తరబడి వేచి ఉంటాలి. పర్వదినాల్లో.. శ్రీకృష్ణాష్టమి.. ఏకాదశి.. పుణ్య తిథులు.. పండుగ రోజుల్లో బాగా రద్దీగా ఉంటుంది. అలాంటి సమయాల్లో ఆలయాన్ని ఆలయాన్ని విద్యుత్ దీపాలు.. పూల దండలతో అలంకరిస్తారు.
ఎలా వెళ్లాలి...
ఉడుపిలో దేవాలయంలో కర్నాటక రాష్ట్ర్తంలో ఉంది. ఉడుపిలో రైల్వేస్టేషన్ .. బస్ స్టేషన్ ఉన్నాయి. రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే.. స్టేషన్ నుంచి 3.2కిలోమీటర్లు ఆటోలు.. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి చేరుకోవచ్చు. విమానంలో వెళ్లాలంటే మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాలి. అక్కడి నుంచి 59 కిలో మీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లి బాల రూపంలో ఉన్న చిన్ని కృష్ణుడిని దర్శించుకోవాలి.