
క్రికెట్ లో ఫీల్డర్లు స్టన్నింగ్ క్యాచ్ లు పట్టడం చూస్తూ స్టేడియంలోని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. అయితే మ్యాచ్ చూడడానికి వచ్చిన ఒక అభిమాని అద్భుతమైన క్యాచ్ తీసుకొని ప్లేయర్స్ ను షాక్ కు గురి చేశాడు. ఆదివారం (ఆగస్టు 10) డార్విన్ వేదికగా మర్రారా క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ కార్బిన్ బాష్ వేసిన షార్ట్ బాల్ ను ఆసీస్ పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ బలంగా బాదాడు. మిడ్ వికెట్ మీదుగా ఈ బాల్ సిక్సర్ వెళ్ళింది. అయితే స్టాండ్స్‌లో ఉన్న అభిమాని క్యాచ్ సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ తీసుకోవడం హైలెట్ గా మారింది.
ఆ అభిమానికి ఒక చేతిలో రెండు బీర్ క్యాన్స్ ఉన్నప్పటికీ ఒంటి చేత్తో అలవోకగా క్యాచ్ అందుకోవడం విశేషం. క్యాచ్ పట్టిన వెంటనే పక్కనే ఉన్న క్రౌడ్ చప్పట్లతో అభినందించారు. బౌలర్ బాష్ ఈ క్యాచ్ కు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇతని క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఈ క్యాచ్ ను బెస్ట్ క్రౌడ్ క్యాచ్ అంటూ అభినందిస్తున్నారు. ఇదే మ్యాచ్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ బౌండరీ దగ్గర స్టన్నింగ్ క్యాచ్ తీసుకోవడం హైలెట్ గా నిలిచింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణీ చేసింది.
బ్యాటింగ్‌లో టిమ్ డేవిడ్ (52 బాల్స్‌లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 83), కామెరూన్ గ్రీన్ (13 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 35) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆసీస్ 17 రన్స్ తేడాతో సఫారీలపై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 లీడ్‌లో నిలిచింది. టాస్ ఓడిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 178 రన్స్‌కు ఆలౌటైంది. 30 రన్స్‌కే మిచెల్ మార్ష్ (13), ట్రావిస్ హెడ్ (2), జోస్ ఇంగ్లిస్ (0) ఔటైనా.. గ్రీన్, డేవిడ్ నాలుగో వికెట్‌కు 40 రన్స్ జోడించారు. మిచెల్ ఒవెన్ (2), మ్యాక్స్‌వెల్ (1), ఆడమ్ జంపా (1) ఫెయిలయ్యారు. బెన్ డ్వారిషస్ (17), నేథన్ ఎలిస్ (12) ఓ మాదిరిగా ఆడారు. ఎంపాక 4, రబాడ 2 వికెట్లు తీశారు.
తర్వాత సౌతాఫ్రికా 20 ఓవర్లలో 161/9 స్కోరుకే పరిమితమైంది. ర్యాన్ రికెల్టన్ (71) టాప్ స్కోరర్. ట్రిస్టాన్ స్టబ్స్ (37) రాణించినా మిగతా వారు నిరాశపర్చారు. హేజిల్‌వుడ్, డ్వారిషస్ చెరో మూడు, జంపా రెండు వికెట్లు పడగొట్టారు. టిమ్ డేవిడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 మంగళవారం ఇదే వేదికపై జరుగుతుంది.
CALLING IT - BEST CROWD CATCH OF THE YEAR AND IT'S ONLY AUGUST!
— cricket.com.au (@cricketcomau) August 10, 2025
Two cans in one hand, Kookaburra in the other. #AUSvSA pic.twitter.com/OHGSlI2y2w