పోకిరి స్పెషల్ షోలకు సూపర్ రెస్పాన్స్

పోకిరి స్పెషల్ షోలకు సూపర్ రెస్పాన్స్

అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి మహేష్ బాబును స్టార్ ను చేసిన మూవీ పోకిరి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో 2006లో వచ్చిన ఈ మూవీ మళ్లీ థియేటర్స్ లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేస్తోన్న స్పెషల్ షోలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. గంటలోనే టికెట్లు అమ్ముడవడం మహేష్ మేనియాకు అద్ధం పడుతోంది. 

స్పెషల్ షోల ద్వారా వచ్చిన డబ్బును MB ఫౌండేషన్ కు ఇవ్వాలని అభిమానులు, పంపిణీదారులు నిర్ణయించారు. MB  ఫౌండేషన్ ద్వారా పిల్లలకు గుండె ఆపరేషన్లు, విద్యకు సహాయం చేయడానికి ఈ విరాళం ఇవ్వనున్నారు. మహేష్ బాబు బాటలోనే వారి అభిమానులు సైతం ముందుకు సాగడాన్ని పలువురు అభినందిస్తున్నారు. 

ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిపోయిన పోకిరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. పోకిరి  సినిమా విడుదలై ఇన్ని సంవత్సరాలైనప్పటికీ... ఆ మూవీలోని డైలాగ్స్, సాంగ్స్ కున్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. కాగా బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించిన ఈ సినిమా 4కె వెర్షన్ లో మరోసారి థియేటర్లో విడుదలకు సిద్ధమైంది. ఆగష్టు 9వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆ రోజే పోకిరి సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.