ప్రభాస్ కు అనుష్క బర్త్ డే విషెస్

ప్రభాస్ కు అనుష్క బర్త్ డే విషెస్

యంగ్ రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ స్టార్స్ తో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల యూనిట్ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ టీం, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌,  మైత్రీ మూవీ మేకర్స్ ప్రభాస్ కు ట్విట్టర్ లో విషెస్‌ తెలిపాయి. అలాగే వెంకీమామ ఫ్యాన్స్‌ ప్రభాస్‌ స్పెషల్‌ డీపీ విడుదల చేసింది.  ప్రభాస్‌తో చాలా సినిమాల్లో జంటగా నటించిన హీరోయిన్ అనుష్క శెట్టి బర్త్ డే విషెస్ తెలిపింది.  ఈ సందర్భంగా ట్వీట్ చేసిన అనుష్క.. లైఫ్‌ లో వచ్చే ప్రతి అంశంలో ప్రభాస్ బెస్ట్‌ గా ఉండాలని, అలాగే తన స్టోరీస్ అన్నీ సక్సెస్ అయి .. అందరి హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్‌ చేసింది.

ప్రభాస్ - అనుష్క కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అలాగే తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌ పండగ చేసు కుంటున్నారు.  ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలున్నాయి. రాధాకృష్ణ డైరెక్షన్ లో రాధేశ్యామ్ వచ్చే ఏడాది  జనవరి 14న రిలీజ్ కానుండగా.. ప్రశాంత్ నీల్‌ తెరకెక్కిస్తున్న సలార్, ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు స్పిరిట్ టైటిల్‌తో అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో మరో మూవీకి సైన్‌ చేశాడు ప్రభాస్.