నేడు లార్డ్స్‌‌లో ఇంగ్లండ్‌‌తో మూడో వన్డేతో వీడ్కోలు 

నేడు లార్డ్స్‌‌లో ఇంగ్లండ్‌‌తో మూడో వన్డేతో వీడ్కోలు 

మ. 3.30 నుంచి సోనీ నెట్‌‌వర్క్‌‌లో లైవ్‌‌

లండన్‌‌: ఇండియా వెటరన్‌‌ పేసర్‌‌, తన ఆటతో ఎంతో మంది యంగ్‌‌స్టర్స్‌‌ను ఇన్‌‌స్పైర్‌‌ చేసిన జులన్‌‌ గోస్వామి కెరీర్‌‌లో ఆఖరాటకు రెడీ అయింది.  ఇంగ్లండ్​తో మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా లార్డ్స్‌‌లో శనివారం జరిగే చివరి మ్యాచ్‌‌తో జులన్‌‌ తన సుదీర్ఘ కెరీర్‌‌కు గుడ్‌‌బై చెప్పనుంది. ఇప్పటికే తొలి  రెండు వన్డేల్లో నెగ్గి సిరీస్‌‌ కైవసం చేసుకున్న ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌ ఈ పోరులోనూ గెలిచి క్లీన్‌‌స్వీప్​ విక్టరీతో ‘జులు దీ’గా పిలుచుకునే గోస్వామికి ఘన వీడ్కోలు పలకాలన్న కృత నిశ్చయంతో ఉంది.  

చార్రితక లార్డ్స్‌‌ మైదానంలో ఆఖరాటను మధురజ్ఞాపకంగా మలచుకోవాలని గోస్వామి కోరుకుంటోంది. క్రికెట్‌‌ మక్కాగా ప్రసిద్ధి చెందిన లార్డ్స్‌‌లో వీడ్కోలు పలికే అవకాశం గావస్కర్‌‌, సచిన్‌‌, లారా, మెక్‌‌గ్రాత్‌‌ వంటి లెజెండరీ ప్లేయర్లకు దక్కలేదు.  మిథాలీ రాజ్‌‌తో పాటు   ఇండియా విమెన్స్‌‌కు ముఖచిత్రంగా పేరు తెచ్చుకున్న జులన్‌‌కు ఇది 204వ ఇంటర్నేషనల్‌‌ మ్యాచ్‌‌. వరల్డ్‌‌ కప్‌‌ను ముద్దాడే అవకాశం దక్కనప్పటికీ.. ఇంగ్లండ్‌‌ గడ్డపై సిరీస్‌‌ను క్లీన్‌‌స్వీప్‌‌ చేస్తే జులన్‌‌ కెరీర్​కు గొప్ప ముగింపు దక్కినట్టు అవుతుంది.