ఫర్గానా హోక్ .. సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించింది

ఫర్గానా హోక్ ..  సెంచరీ  కొట్టి  చరిత్ర సృష్టించింది

బంగ్లాదేశ్ మహిళా ప్లేయర్ ఫర్గానా హోక్ ​​చరిత్ర సృష్టించింది. ఆ దేశం తరుపున వన్డే క్రికెట్ లో తొలి సెంచరీ చేసిన  బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. భారత్‌తో జరుగుతున్న మూడో  మ్యాచ్‌లో ఫర్గానా  ఈ మైలురాయిని అందుకుంది. ఓపెనర్ గా బరిలోకి దిగిన  ఫర్గానా..  160 బంతుల్లో 107 పరుగులు చేసింది. ఇందులో  6 ఫోర్లు ఉన్నాయి.  52 ఇన్నింగ్స్‌ల్లో ఫర్గానా 24.10 సగటుతో 1133 పరుగులు చేసింది. 

ఢాకా వేదికగా ఇండియాతో మూడో వన్డేలో  బంగ్లాదేశ్ జట్టు ముందుగా టాస్ గెలిచి  బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణిత 50 ఓవర్లలో  ఆ జట్టు..  4 వికెట్ల నష్టానికి 225 పరుగులు  చేసింది.  ఓపెనర్లు షమీమా సుల్తానా, ఫర్గానా హోక్ ​జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే చెరో మ్యాచ్ లో గెలిచి ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్  గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకోనుంది.