
సిద్దిపేట జిల్లాలో కొండపాక మండలం తహశీల్దార్ ఆఫీస్ లో ఉద్రిక్తత నెలకొంది. దమ్మకపల్లి గ్రామానికి చెందిన తోకల లక్ష్మీ, యాదయ్య ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. తమకు ఉన్న 22 గుంటల భూమి వేరే వారి పేరు మీదకు ఎక్కించారని ఆరోపిస్తున్నారు రైతు దంపతులు. కొద్దిరోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతుతో మాట్లాడారు.