ఏటీఎం కార్డు మార్చేసి దోపిడీ.. రైతు నుంచి రూ. 1.15 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ఏటీఎం కార్డు మార్చేసి దోపిడీ.. రైతు నుంచి రూ. 1.15 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ఘట్​కేసర్ వెలుగు: ఏటీఎం వద్ద సహాయం చేస్తామంటూ నమ్మబలికి ఓ రైతును ఇద్దరు దారుణంగా మోసగించారు. మేడ్చల్ జిల్లా అంకుశాపూర్​కు​చెందిన రైతు బీరెడ్డి రవీందర్ రెడ్డి (50) ఈ నెల 7న ఘట్​కేసర్ పరిధి శివారెడ్డిగూడలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంకు మనీ విత్​డ్రా చేయడానికి వెళ్లాడు. అక్కడున్న ఇద్దరు దుండగులు సహాయం చేస్తామంటూ మాటలతో అతడిని గందరగోళానికి గురిచేసి చాకచక్యంగా ఏటీఎం కార్డును మార్చేశారు. బాధితుడికి అశోక్ కుమార్ అనే వ్యక్తికి చెందిన వేరే కార్డు ఇచ్చి పరారయ్యారు.

అనంతరం రవీందర్ రెడ్డి ఖాతా నుంచి విడతల వారీగా మొత్తం రూ. 1.15 లక్షల నగదును దోచుకున్నారు. మొబైల్​కు వచ్చిన మెసేజ్​లను చూసి షాక్​కు గురైన బాధితుడు.. తాను మోసపోయానని గ్రహించి ఆదివారం ఘట్​కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.