మార్చి లోగా రూ.50 వేల రైతు రుణాలు మాఫీ

మార్చి లోగా  రూ.50 వేల రైతు రుణాలు మాఫీ

గ‌తంలో హామీ ఇచ్చిన‌ట్టుగా రూ. 50 వేల లోపు రుణం ఉంటే ఈ ఏడాది మార్చి చివరినాటికి మాఫీచేయనుంది ప్రభుత్వం. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 75 వేల లోపు రుణాల‌ను కూడా మాఫీ చేయాల‌ని నిర్ణ‌యించారు. పంట రుణాలకు  మొత్తం రూ. 16,144 కోట్లు కేటాయించింది. ఈ సారి 5. 12 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రుణాలు మాఫీ కానుంది.

వ్యవసాయ రంగానికి గత ఏడేళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్ లో నిధులు కేటాయిస్తోంది. గత ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రైతు బంధు పథకం కింద 50,448 కోట్లరూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. రైతు మరణిస్తే రైతు భీమా పథకం ద్వారా వారి కుటుంబాలకు  ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. ఈ వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మొత్తంగా 24,254 కోట్ల రూపాయలు కేటాయించారు.