న‌ర్సిరెడ్డి కుటుంబ నిర్ణ‌యం అందరికీ స్ఫూర్తి దాయకం

న‌ర్సిరెడ్డి కుటుంబ నిర్ణ‌యం అందరికీ స్ఫూర్తి దాయకం
  • భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

నల్గొండ: అవయవదానం చేసి ఇత‌రుల జీవితాల‌ను కాపాడ‌డం గొప్ప విష‌యం.. బ్రెయిన్ డెడ్ అయిన రైతు న‌ర్సిరెడ్డి అవయవాలను దానం చేయడం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. న‌ల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన వరకాంతం న‌ర్సిరెడ్డి అనే పేద రైతు ఈనెల‌ ‌30న బ్రెయిన్ డెడ్ అయి చ‌నిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రమని ఆయన పేర్కొన్నారు. అవయవ దానం చేసిన ఉదంతంపై స్పందించిన ఆయన నర్సిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని అభయం ఇచ్చారు. త‌క్ష‌ణ సాయంగా రూ. ల‌క్ష ఆర్ధిక సాయం ప్రకటించారు. ప్ర‌తీక్ ఫౌండేష‌న్ ద్వారా చిన్నారుల చ‌దువు బాధ్య‌త‌లు తీసుకుంటామని ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలిపారు.

బ్రెయిన్ డెడ్ అయి చ‌నిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం.. అయినా సరే ఆప‌ద‌లో ఉన్న‌ ఇత‌రుల జీవితాల‌ను నిల‌బెట్ట‌డానికి వారి కుటుంబ స‌భ్యులు ముందుకు వ‌చ్చి గుండె దానం చేయ‌డం మాటల్లో వర్ణింలేని గొప్ప విష‌యమ‌ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వారి సేవా దృక్ప‌థం అభినంద‌నీయ‌మ‌న్నారు. తాను మ‌ర‌ణిస్తూ ఐదుగురు జీవితాల‌ను కాపాడిన న‌ర్సిరెడ్డి, వారి కుటుంబ స‌భ్యులు చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని ఆయన తెలిపారు. వారి కుటుంబానికి న‌ర్సిరెడ్డి లేని లోటు తీర్చ‌లేనిదే..  ఇబ్బందులు త‌లెత్త‌కుండా త‌క్ష‌ణ సాయంగా ల‌క్ష రూపాయ‌లు ఆర్ధిక సాయం చేస్తామ‌ని ప్రకటించారు. అలాగే వారి ఇద్దరి పిల్లల చ‌దువుకు అయ్యే ఖ‌ర్చును ప్ర‌తీక్ ఫౌండేష‌న్ ద్వారా చేప‌ట్టి జీవితంలో స్థిర‌ప‌డే వ‌ర‌కు అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి అనుకోని ఘ‌ట‌న‌లు జరిగిన‌ప్పుడు గుండె నిబ్బరం చేసుకుని ఇత‌రుల జీవితాల‌ను కాపాడాలని నిర్ణయం తీసుకున్న న‌ర్సిరెడ్డి కుటుంబాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల‌ని ఆయన సూచించారు.

For More News..

కూతురితో కలసి రెండంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకింది

అమ్మాయిలా చాటింగ్ చేసి.. 70 మందిని మోసం చేసిన యువకుడు

లైసెన్స్‌‌‌‌‌‌‌‌ లేని వాళ్లకు బండిస్తే రూ. 5 వేలు ఫైన్

పోతిరెడ్డిపాడు పక్కనే రాయలసీమ లిఫ్ట్‌