
హైదరాబాద్, వెలుగు: ఏ రైతు కూడా కరువును కోరుకోరని.. అత్యంత దారుణమైన పరిస్థితుల్లోను ప్రభుత్వం నుంచి సానుభూతిని మాత్రమే కోరుకుంటారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సోమవారం ట్విట్టర్లో ఆయన పోస్ట్ పెట్టారు. రైతులు తమ పంట రుణాల మాఫీ కోసం ఏటా కరువు రావాలని కోరుకుంటున్నారని కర్నాటక మంత్రి శివానంద పాటిల్వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. రైతుల గురించి ఇలా మాట్లాడుతున్న మీరేం మంత్రులని ప్రశ్నించారు.