పొలం అమ్మినోళ్లే కబ్జా.. పట్టించుకోని అధికారులు

పొలం అమ్మినోళ్లే కబ్జా.. పట్టించుకోని అధికారులు

తాను కొనుగోలు చేసిన పొలాన్ని అమ్మిన వ్యక్తే కబ్జా చేయడంతో ఆత్మహత్యకు యత్నించాడు ఓ రైతు కొడుకు. భూమి అమ్మిన వ్యక్తే మోసం చేయడం, రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేయకపోవడంతో విసుగుచెందిన అతను సెల్ టవర్ ఎక్కి నిరశన తెలిపాడు. అయినా అధికారులు స్పందించలేదు.

పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన కట్ల రాయమల్లు 10 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన చందుపట్ల రఘొత్తం రెడ్డి దగ్గర 5 ఎకరాల 23 గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసాడు. కానీ ఇప్పటి వరకు ఆ పొలం రిజిస్ట్రేషన్ జరగలేదు. కారణం ఆ భూమి అంతకు ముందు రఘొత్తం రెడ్డికి అమ్మిన అతని అన్న రాం రంగా రెడ్డి పేరున ఉండటం వల్ల రిజస్ట్రేషన్ సాధ్యం కాలేదు.

తాను కొనుగోలు చేసిన భూమిని సాగుచేసుకుంటున్న రాయమల్లు కొడుకు రమేష్..  ఆ భూమిని పట్టా చేయమని ముత్తారం తహశీల్దార్ రాజమణిని కోరగా అతను పట్టా చేయలేదు. తమకు పొలం అమ్మిన రఘొత్తం రెడ్డే తాము కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేసి దున్నుతున్నాడని అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోక పోవడంతో రమేష్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.

సమాచారం అందుకున్న మంథని సిఐ, ఎస్ఐ మహేందర్ లు సంఘన స్థలం వద్దకు చేరుకుని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయిన పలితం లేక రెవెన్యూ అధికారులకు ఫోన్ లో సమాచారం అందించారు. అయినప్పటికీ నాలుగు గంటలైన అధికారులు సంఘటన స్థలానికి రాలేదు.

దీంతో రమేష్ టవర్ మీద ఉండగానే అతని కుటుంబ సభ్యులు మంథని అంబెడ్కర్ చౌరస్తాలో పురుగుల మందు డబ్బాతో రోడ్డు పై పడుకొని నిరసన తెలిపారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పురుగుల మందు డబ్బా పడేసి వారిని వాహనం లో పోలీసు స్టేషన్ తరలించారు. ఈ విషయం తెలుకున్న పెద్ధపల్లి జెడ్పిచైర్మన్ పుట్ట మధు సంఘటన స్థలానికి చేరుకొని హామీ ఇవ్వగా రమేష్ సెల్ టవర్ దిగి కిందకు వచ్చాడు.