పురుగుల మందు డబ్బాతో ధర్నా: దిగొచ్చిన కలెక్టర్

పురుగుల మందు డబ్బాతో ధర్నా: దిగొచ్చిన కలెక్టర్

పాస్ పుస్తకాలు ఇవ్వకుండా VRO ఇబ్బంది పెడుతున్నాడంటూ ఓ రైతు కుటుంబం ఖమ్మం కలెక్టరేట్ ముందు పురుగుల మందు డబ్బాతో ధర్నాకి దిగింది.  తిరుమలాయపాలెం మండంల ఎర్రగడ్డ గ్రామానికి చెందిన ఏపూరి లక్ష్మయ్య కు 15 కుంటల భూమికి సర్వే నెంబర్లు సరి చేయడానికి ఏడాది నుంచి తహసిల్దార్ ఆఫీసుకు తిరుగుతున్నాడు.  అధికారులు స్పందించకపోవడంతో మనస్థాపం చెందిన లక్ష్మయ్య… తన కుటుంబ సభ్యులతో కలసి కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు.  ఇది తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే… అధికారులతో మాట్లాడి పాస్ బుక్స్ మంజూరు చేయించడంతో రైతు ధర్నా విరమించాడు.