సంఘటితమైతేనే రైతుల మనుగడ ..సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

సంఘటితమైతేనే రైతుల మనుగడ ..సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

హైదరాబాద్​సిటీ, వెలుగు: ‘రైతును బ్రతికించాలి. కాపాడాలి.. అండ‌‌‌‌గా ఉండాలి’ అనే నినాదంతో యూత్ ఫ‌‌‌‌ర్ యాంటీ కరప్షన్​సంస్థ ఫౌండ‌‌‌‌ర్ రాజేంద్ర ప‌‌‌‌ల్నాటి ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో అన్నదాతకు ఆత్మీయ స‌‌‌‌త్కారం నిర్వహించారు. దీనికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, మాజీ అగ్రికల్చర్ ఆఫీసర్ అశోక్ కుమార్ ముఖ్య అతిథి గాహాజరయ్యారు. 

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రైతులంతా సంఘటితమై రాజకీయాలు మార్చాలన్నారు. నిజాయితీ రాజకీయాలకు రైతులే పునాది వేయాలన్నారు. ఇండిపెండెన్స్​డే రోజు రైతులతో జెండా ఎగరవేయించాలని, టోల్ గేట్ దగ్గర రైతులకు ఉచితం అని పెట్టాలన్నారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. రైతు లేకపోతే సమాజం లేదని, రైతులంతా కష్టపడితే అందరూ తింటున్నారన్నారు. 

ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 25మంది రైతులను సత్కరించారు. డా. స్రవంతి, పబ్బ శరణ్య, కొమటి రమేశ్ బాబు, కొన్నె దేవేందర్, బత్తిని రాజేశ్, గీతానంద్, రాగి స్వప్న, గంగాధర్, నాగేంద్ర, వంశీకృష్ణ, రాజేశ్ పాల్గొన్నారు.