- సీఎంవో సెక్రటరీతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ల(ఎఫ్ పీవో)ను మరిన్ని ఏర్పాటు చేయాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సెక్రటేరియెట్ లో సీఎంవో సెక్రటరీ శేషాద్రితో సమావేశమయ్యారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న వ్యవసాయ, మార్కెటింగ్ విధానాలపై నివేదికను అందజేశారు.
ఎఫ్ పీఓ ల ఏర్పాటులో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే వెనుకబడి ఉందని కోదండరెడ్డి గుర్తుచేశారు. కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ వంటి రాష్ట్రాల్లో ఎఫ్ పీఓ లు బలంగా పనిచేస్తున్నాయని, రైతుల ఆర్థిక బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ముఖ్యంగా నాసిక్‌లోని సహ్యాద్రి ఎఫ్ పీఓ దేశంలోనే ఆదర్శంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
