సీఎం రేవంత్‌‌ రెడ్డితో రైతు కమిషన్‌‌ భేటీ..మైనర్‌‌ ఇరిగేషన్‌‌పై నివేదిక అందజేత

సీఎం రేవంత్‌‌ రెడ్డితో రైతు కమిషన్‌‌ భేటీ..మైనర్‌‌ ఇరిగేషన్‌‌పై నివేదిక అందజేత

హైదరాబాద్‌‌, వెలుగు: సీఎం రేవంత్‌‌ రెడ్డితో రైతు కమిషన్‌‌ చైర్మన్‌‌ కోదండరెడ్డి, సభ్యులు జూబ్లీహిల్స్‌‌లోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. మైనర్‌‌ ఇరిగేషన్‌‌ పై రూపొందించిన నివేదికను సీఎం రేవంత్‌‌రెడ్డికి కమిషన్‌‌ బృందం అందజేసింది. రెండేళ్లలో కమిషన్‌‌ చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వానికి అందించిన సలహాలు, సూచనలను చైర్మన్‌‌, సభ్యులు సీఎంకు వివరించారు. 

పంటల మార్పిడి, ఉద్యానవన పంటల సాగు పెంపు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌‌పీవో) ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. కమిషన్‌‌ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. రైతులకు అండగా పనిచేస్తున్న కమిషన్‌‌ను అభినందించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు అర్హులైన రైతులకు చేరేలా చూడాలని కోరారు. సమావేశంలో చైర్మన్​ కోదండరెడ్డి, కమిషన్‌‌ సభ్యులు కేవీఎన్‌‌ రెడ్డి, రాములు నాయక్‌‌, గోపాల్‌‌రెడ్డి, గడుగు గంగాధర్‌‌, భవానీ రెడ్డి పాల్గొన్నారు.