కోల్‌కతా: కలకత్తా హైకోర్టు ఆర్డర్ఉల్లంఘించారన్న ఆరోపణలపై బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆమెతో పాటు వెస్ట్ బెంగాల్ తృణమూల్ ఛాత్ర పరిషత్ నిర్వాహకులపైనా పోలీసులు కేసు పెట్టారు. ఈ నెల 28న నిర్వహించిన సంఘ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో టీఎంసీ మద్దతుదారులు బారికేడ్లను నెట్టివేయడంతో పాటు పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారు. టైమ్ అయిపోయాక కూడా సభను కొనసాగించారు. సభ నిర్వహణకు సంబంధించి హైకోర్టు షరతులను ఉల్లంఘించడంతో పోలీసులు ఈమేరకు చర్యలు తీసుకున్నారు.
