వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా ముప్పేట పోటీ

వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా ముప్పేట పోటీ

ప్రధాని అభ్యర్థి హోదాలో 2014 లోక్ సభ ఎన్నికల్లోనరేంద్ర మోడీ పోటీ చేసిన నియోజకవర్గం వారణాసి.ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ కూడా ఇక్కడి నుంచే బరిలో నిలిచారు. అప్పటిలానే ఇప్పుడు కూడా వారణాసి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సారిమోడీ అసాధారణ అభ్యర్థులతో పోటీ పడుతున్నారు.రైతులు, మాజీ జడ్జి, జవాను, ప్రొఫెసర్.. ఇలా దాదాపు వంద మందికిపైగా అభ్యర్థులు సై అంటే సై అంటున్నారు. ప్రచారం కోసం కొందరు, నిరసనగా మరికొందరు, తమ సమస్యను దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు మరికొందరు వారణాసిని అస్త్రంగా ఎంచుకున్నా రు. వివాదాస్పద మాజీ జడ్జి కర్ణన్

మోడీపై కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్సీఎస్ కర్ణన్ పోటీకి దిగనున్నారు. వారణాసిలో పోటీచేయనున్నట్లు ప్రకటించారు. వివాదాస్పద జడ్జిగాపేరు పొందిన కర్ణన్.. కోర్టు ధిక్కరణ నేరం కిందశిక్షకు గురైన తొలి సిట్టింగ్ జడ్జి. దాదాపు 6 నెలల పాటు ఆయన జైలులో ఉన్నా రు. అవినీతికి వ్యతిరే కంగాపోరాటం చేస్తానని తమిళనాడుకు చెందిన 63 ఏళ్లఈ మాజీ జడ్జి చెబుతున్నా రు. 2018లో యాంటీ కరప్షన్‌‌ డైనమిక్‌‌ పార్టీ (ఏసీడీపీ)ని స్థాపించిన ఆయన..సెంట్రల్ చెన్నై సీటు నుంచి కూడా పోటీ చేస్తున్నా రు.

111 మంది రైతులు

అచ్చంగా నిజామాబాద్ సెగ్మెంట్​లో మాదిరే వారణాసిలో రైతులు తమ నిరసన తెలుపుతున్నారు.రుణమాఫీ తదితర సమస్యలను పరిష్కరించాలంటూ 2017లో తమిళనాడు రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేశారు. అయితే ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో అందుకు నిరసనగా 111 మంది రైతులు నామినేషన్ వేయనున్నా రు. పి.అయ్యకన్ను నేతృత్వంలో వారుముందుకు సాగుతున్నారు.

తెలుగు రాష్ట్రాల ఫ్లోరోసిస్ బాధితులు

రాష్ర్టంలోని నల్గొండ, ఏపీలోని ప్రకాశం జిల్లాల ఫ్లోరోసిస్ బాధితులు మోడీతో పోటీకి సై అంటున్నా రు.వడ్డే శ్రీనివాస్, జలగం సుధీర్ అనే వ్యక్తుల నేతృత్వంలో వీరు ముందుకెళ్తున్నా రు. ఫ్లోరోసిస్ సమస్యను దేశానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వారు వారణాసిలో నామినేషన్లు వేస్తున్నారు.

భీమ్ ఆర్మీ చీఫ్

యువనేత, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడామోడీతో కలబడుతున్నారు. మార్చి 30న రోడ్ షో నిర్వహించిన ఆజాద్.. మోడీ ఓటమి మొదలైందంటూ హెచ్చరిం చారు. తన ప్రసంగాలతో దళిత ఓట్లను ఆకర్షిస్తున్నారు. గత నెలలో ఆస్పత్రి పాలైన ఆజాద్ ను  ప్రియాంకా గాంధీ కలవడంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది.

బీఎస్ఎఫ్ మాజీ కానిస్టేబుల్

బీఎస్ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ కూడా వారణాసి సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్ గాబరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నా రు. జవాన్లకుసరైన భోజనం పెట్టడం లేదని చెబుతూ ఆయనవిడుదల చేసిన వీడియో గతేడాది పెద్ద దుమారం రేపింది. అయితే తర్వాత ఆయన్ను సర్వీసు నుంచి డిస్మిస్ చేశారు. తేజ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని విచారణ జరిపిన కమిటీ తేల్చింది.ప్రొఫెసర్, పూజారి కూడా..బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌ యూ)ప్రొఫెసర్ విశ్వం భర్నాథ్ మిశ్రా, వారణాసిలోనిసంకత్ మోచన్ ఆలయం మహంత్ (పూజారి) కూడాపోటీ చేయాలని భావిస్తున్నా రు. కాగా, వారణాసినియోజకవర్గం లో మే 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

మోడీపై పోటీకి ప్రియాంక సై?

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ జనరల్‌‌‌‌ సెక్రటరీ ప్రియాంకగాంధీ వారణాసి నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రధానిమోడీపై ఆమె పోటీ చేస్తారని జాతీయ మీడియాకథనం. బాగా ఆలోచించి న తర్వాతే ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేయడానికి రెడీ అన్నారని తెలుస్తోంది. హైకమాండ్‌‌‌‌ నిర్ణయిస్తే మోడీపై పోటీచేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. యూపీఏ చైర్‌‌‌‌పర్సన్ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌ బరేలి నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు ప్రియాంకను కోరినప్పుడు, వారణాసి నుంచి ఎందుకు చేయకూడదు? అని ఆమెఎదురు ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌ లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత తనకు కాంగ్రెస్‌ అప్పగించిందని, ఒకవేళ పార్టీ హైకమాండ్‌‌‌‌ కోరితే లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తాననిలక్నోలో ఈమధ్యనే ప్రియాంక చెప్పారు.