రెవిన్యూ అధికారులను నిర్బంధించిన రైతులు

రెవిన్యూ అధికారులను నిర్బంధించిన రైతులు

రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగినా.. అధికారులు తమ భూములను ఆన్ లైన్ చేయడం లేదని విసిగిపోయిన రైతులు  వారిని గదిలో నిర్బంధించి నిరసన తెలిపారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఆన్సాన్ పల్లిలో జరిగింది. బుధవారం గ్రామంలో జరిగే రెవిన్యూ  సదస్సుకు హాజరైన తహశీల్దార్ సత్యనారాయణ, డిప్యూటీ తహశీల్దార్ నగునూరి శ్రీనివాస్, నలుగురు వీఆర్వోలను  గ్రామస్థులు గదిలో నిర్బంధించారు. డబ్బులు ఇస్తే కానీ వీఆర్వోలు భూములను ఆన్లైన్ చేయడం లేదని, భూములు ఆన్ లైన్ చేయాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా ఇప్పటివరకు సగం భూములను కూడా ఆన్ లైన్ చేయకపోవడంతో నిరసనగా రెవిన్యూ ఆఫీసర్లను సుమారు గంట పాటు బంధించారు. విషయం తెలుసుకున్న కొయ్యూరు ఎస్సై నరేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు సర్ధి చెప్పారు. ఎస్సై హామీతో గ్రామస్తులు రెవెన్యూ ఆఫీసర్లను విడుదల చేశారు.