పంట దక్కాలంటే ట్యాంకర్లతో పోయాల్సిందే

పంట దక్కాలంటే ట్యాంకర్లతో పోయాల్సిందే

మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాలజిల్లా మెట్ పల్లి మండలంలో ఈ సీజన్లో వరిపంట ఎక్కువగా సాగు చేశారు. అయితే వర్షాలు లేక వేసవి ప్రారంభంలోనే భూగర్భజలాలు పడిపోవడంతో పంటలను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. జగ్గసాగర్ గ్రామానికి చెందిన సారా గంగారెడ్డి రామలచ్చక్కపేట శివారులో బోరు పై ఆధార పడి మూడెకరాల్లోవరి సాగు చేశాడు. బోరు ఎత్తిపోవడంతో సాగునీరు అందక పంట ఎండిపోయే స్థితికి వచ్చింది.ఎలాగైనా పంటను కాపాడుకోవాలని తెలిసినవారి దగ్గర ట్యాంకర్ తీసుకున్నారు. రెండుకి.మీ. దూరంలోని బావి దగ్గర నుంచి ప్రతిరోజు 8 ట్రిప్పుల నీటిని పొలానికి పారిస్తున్నాడు. ఇందుకోసం రోజుకు సుమారు రూ.1000వరకు ఖర్చు చేస్తున్నాడు. ఇలా పది రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశాడు. ఇక దాదాపుగా పంట చేతికి వచ్చినట్టేనని, అవసరమైతే మరో రెండు మూడు తడులు అందిస్తాననిఅంటున్నాడు.