రాజోలి మండల పరిధిలోని సర్వే పనులను అడ్డుకున్న రైతులు

రాజోలి మండల పరిధిలోని సర్వే పనులను అడ్డుకున్న రైతులు

గద్వాల/ శాంతినగర్, వెలుగు : గద్వాల జిల్లా  రాజోలి మండల పరిధిలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో భాగమైన మల్లమ్మ కుంట రిజర్వాయర్ భూ సేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. గురువారం రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములను సర్వే చేసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ ఆఫీసర్లు వచ్చారు. భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులు అక్కడికి చేరుకొని తమకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా సర్వే పనులు ఎలా చేస్తారని ఆఫీసర్లతో వాగ్వివాదానికి దిగారు.

ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం తగిన పరిహారం అందించాలని, లేకపోతే భూమికి భూమి కేటాయించేలా స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సర్వే పనులు చేయొద్దని  తేల్చి చెప్పారు. దీంతో ఆఫీసర్లు తిరిగి వెళ్లిపోయారు.