
జగిత్యాల జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కొరత ఉండటంతో.. సింగిల్ విండో కార్యాలయం ఎదుట తెల్లవారు జాము నుంచి పడిగాపులు గాస్తున్నారు. గోదాంలో 50 లారీల యూరియా ఉన్నా… ఎరువులు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని, 3 వందల టన్నుల బఫర్ స్టాక్ ఉంచామంటున్నారు అధికారులు. మరో రెండ్రోజుల్లో వీటిని రైతులకు సరఫరా చేస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎరువులు, యూరియూ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.