ఆరుగాలం పని చేసి పంట పండించిన రైతులకు పంటను అమ్ముకునేందుకు ఎదురుచూపులు తప్పడం లేదు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాల్లో కాంటా అనంతరం గోదాంలలో బస్తాలు అన్లోడ్ చేయడానికి హమాలీలు కొర్రీలు పెడుతుండడంతో ట్రాక్టర్లు బస్తాలతో నాలుగు రోజులుగా రోడ్డుపైనే నిలబడిపోయాయి. తీవ్ర ఎండతో ఇబ్బందులు పడుతున్నా, రైతులు సమీపంలోని చెట్ల నీడతప్ప ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని చెబుతున్నారు.
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో పంటను విక్రయించినా మిల్లర్లకు పంపేందుకు లారీలు లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపురంలోని లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎదుట ఆయా గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.– మొగుళ్లపల్లి/ మంగపేట, వెలుగు
