అలంపూర్ మార్కెట్ యార్డుకు తాళం వేసిరైతుల నిరసన

అలంపూర్ మార్కెట్ యార్డుకు తాళం వేసిరైతుల నిరసన
  • మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని ధర్నా 

అలంపూర్, వెలుగు: ఉండవెల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు గురువారం ధర్నా చేశారు. మొక్కజొన్న పంటను కొనుగోలు చేసినప్పటికీ వాహనాల్లో  తరలించే వరకు రైతుదే బాధ్యతని ఆఫీసర్లు చెప్పడంతో మార్కెట్ యార్డుకు రైతులు తాళం వేసి నిరసన తెలిపారు.  

గన్నీ  బ్యాగులను కూడా పలుకుబడి ఉన్న రైతులకు ఇవ్వడంతో చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  అలంపూర్, క్యాతూరు పీఎసీఎస్ కొనుగోలు సెంటర్ల నుంచి త సరుకు కొనుగోలు చేయడానికి స్థలం లేదంటూ నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మొక్కజొన్న పంటను సీరియల్ ప్రకారం కొనుగోలు చేయాలని రైతులు  కోరుతున్నారు.