భూ సర్వే చేయడానికి వచ్చిన ఆఫీసర్లను అడ్డుకున్న రైతులు

భూ సర్వే చేయడానికి వచ్చిన ఆఫీసర్లను అడ్డుకున్న రైతులు

మెదక్/శివ్వంపేట, వెలుగు: రైతుబంధు ఇవ్వకున్నా సరే, వడ్లు కొనకున్న పర్వాలేదు, మా ప్రాణం పోయినా భూములియ్యమని రైతులు తేల్చి చెప్పారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతన్ పల్లి గ్రామంలో శనివారం రీజనల్​ రింగు రోడ్డు కోసం భూ సర్వే చేయడానికి వచ్చిన ఆఫీసర్లను రైతులు, ప్రజలు అడ్డుకున్నారు. తమ గ్రామం మీదుగా రింగ్​ రోడ్డు వేయొద్దన్నారు. గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే చిన్న రైతులే ఉన్నారని, భూములు తీసుకుంటే తమ బతుకుదెరువు ఎలాగని ప్రశ్నించారు. రోఇప్పటికే కాళేశ్వరం కాలువలో భూములు కోల్పోయి రోడ్డున పడ్డామని, ఇపుడు ఉన్న కొద్దిపాటి భూములు కూడా పోతే ఆత్మహత్యలే దిక్కని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన శంకరయ్య రింగ్​రోడ్డు నిర్మాణంతో మూడెకరాల భూమి పోతుందని బెంగతో నాలుగు నెలల కిందట పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన భార్యాపిల్లలు, ఆవేదన వ్యక్తం చేశారు.