వడ్లు కొంటలేరని రోడ్డెక్కిన రైతులు

వడ్లు కొంటలేరని రోడ్డెక్కిన రైతులు
  • పరిగి–మహబూబ్​నగర్ రోడ్​పై వరి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన

పరిగి, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొంటలేరంటూ వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని బొంపల్లి గ్రామ రైతులు రోడ్డెక్కారు. వికారాబాద్ జిల్లాలో వడ్ల కొనుగోలుకు 127 సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే, పరిగి సెగ్మెంట్ దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐకేపీ సెంటర్​లో వడ్లు కొంటలేరంటూ మంగళవారం మధ్యాహ్నం రైతులు ఆందోళన చేపట్టారు. పరిగి–మహబూబ్ నగర్ రోడ్డుపై వరి ధాన్యాన్ని పోసి నిప్పటించారు.

పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. రైతులతో మాట్లాడి వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. వికారాబాద్ జిల్లాలో లక్షా 75 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని అధికారులు కొనడం లేదంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేశారనే వివరాలు సైతం అధికారుల దగ్గర లేనట్లు సమాచారం.